సమస్యల పరిష్కారానికి ప్రజావాణి —జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

 

మెదక్ ప్రాజబలం న్యూస్:-

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి 82 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భాoగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నేటి ఫిర్యాదులలో ఎక్కువ ఫిర్యాదులు భూములకు సంబంధించి, ఉద్యోగం, ఉపాధి తదితర ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు వాటిని, త్వరితగతిన పరిష్కరించాలన్నారు..

ధరణి కి సంబంధించిన సమస్యలపై ఎల్లం,లక్ష్మి లు తూప్రాన్, నావీన్, కిష్టయ్య కుల్చారo,రాజేందర్ రెడ్డి రామాయంపేట , లావణ్య శంకరంపెట్ వారు భూ సమస్యల పరిష్కారం కోసం ,
మున్సిపల్ పరిధిలో అనుమతుల కోసం k.కృష్ణ రామాయంపేట , ఉపాధి, ఉద్యోగం కోసం వినోద శివంపేట్,శంకర్ లు వివిధ అంశాలపై ఫిర్యాదులు అందించారు. పెన్షన్ కోసం రాములు నిజాంపేట్, బాలకిషన్ కౌడి పల్లి నుంచి పిర్యాదులు అందించారు. మొత్తం 82 పిర్యాదులు అందాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు వేంకటేశ్వర్లు , డి ఆర్ ఓ పద్మ శ్రీ, డి పి ఓ సాయి బాబా, మైనింగ్ & జియాలజీ సహాయ సంచాలకులు జయరాజ్, డి ఎఫ్ ఓ రవి ప్రసాద్, డి ఏ ఓ గోవింద్, డి ఈ ఓ రాధా కిషన్, డి డబ్ల్యూఓ బ్రహ్మాజీ , పి డి మెప్మా ఇందిర,డి. ఐ .ఈ. ఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking