హైదరాబాద్ మార్చ్ 27 ;సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భక్తుల పూజలనందుకుంటున్న నాగేంద్రుని పలు ఆలయాలతో పాటుగా అతి ముఖ్యమైన దేవాలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకుంది స్టార్ మా లో ప్రసారం కానున్న నాగపంచమి సీరియల్ బృందం. దీనిలో భాగంగా ఈ రోజున సికింద్రాబాద్ సైనిక్‌పురి వద్ద ఉన్న శృంగేని శంకర మఠం లోని శ్రీ విజయ గణపతి దేవాలయం తో పాటుగా పోచారం వద్ద ఉన్న శ్రీ స్పటిక లింగేశ్వర ఆలయాలను సందర్శించింది ఈ బృందం. ఈ దేవాలయాలను దర్శించి, భక్తులతో ముచ్చటించిన నాగపంచమి బృందం, ఈ నెల 27 నుంచి స్టార్‌మా లో ఈ సీరియల్ ప్రసారం కానుందని, గతంలో ఎన్నడూ చూడని నాగదేవత కథతో ఇది ప్రసారం కానుందని వెల్లడించింది. స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఈ బృందం పలు దేవాలయాలను సందర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బంధాలనే తాము చూపుతామంటూ స్టార్ మా వినూత్నమైన కథనంతో నాగపంచమి సీరియల్‌తో వస్తుంది. పాలు పోసి కాపాడమ్మా అని నిర్మలమైన మనసుతో ప్రార్ధిస్తే చాలు తానున్నాననే నాగదేవత కథనంతో తీర్చిదిద్దిన ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారం కాబోతుంది