జగిత్యాల, సెప్టెంబర్ 14: ఆంధ్ర ప్రదేశ్ లో అరెస్ట్ అయ్యిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల కావాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో టిడిపి నేతలు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న ఆద్వర్యంలోని టిడిపి నేతలు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని న్యాయం చేసి చంద్రబాబును విడిపించేలా పాలకులకు కనువిప్పు కలిగించాలని బాబాను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కొండ శ్రీదర్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు బత్తుల కొండయ్య, ఒరగంటి భార్గవ్ రాం, వుప్పుల రవి, నక్క లక్ష్మణ్, కల్లెడ అంజన్న, బత్తుల కోటయ్య, జున్ను మల్లన్నలు, రేగొండ శ్రీహరి, అక్కినపెళ్లి కాశినాతం పాల్గొన్నారు