దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు – పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ ప్రజాబలం ప్రతినిధి:మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి 102వ జయంతి సందర్భంగా నేడు హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం వంగరలో కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గారు, మాజీ శాసన సభ్యులు, హుస్నాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ అలిగి రెడ్డి ప్రవీణ్‌ రెడ్డి గారు మరియు స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ గారు మాట్లాడుతూ నేటి తరం వారు పీవీ నరసింహారావు గారి రాజకీయ సామాన్య జీవితం గురించి తెలుసుకోవాలి ఈ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవి అనంతరం కూడా మాలాంటి కాంగ్రెస్‌ నేతల పట్ల ఈ జిల్లా ప్రజల పట్ల ఎంతో అభిమానాన్ని చూపెట్టేవారు, సమకాలిన రాజకీయాల గురించి వారితో చర్చించుకోవడం మా అదృష్టంనేటి రాజకీయాలను పీవీ నరసింహారావు గారి రాజకీయాలను చూస్తే పూర్తిగా సిలబస్‌ మారిపోయినట్లుగా ఉంటుంది వారి హయాంలో దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం, ఉద్యోగాలు పొందడం ఉన్నత పదవులతో విదేశాలలో స్థిరపడిన వారు నవోదయ విద్యాలయాల విద్యార్థులు, అలాంటి నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పి ఓకే విధమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి దేశమంతా 500 జిల్లాలలో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. పేదవాడికి భూమి లేకుంటే జీవనాధారం కష్టమవుతుందని గమనించి భూ సంస్కరణలు ప్రవేశపెట్టి భూమిలేని ప్రతి పేదవాడికి భూమి ఇచ్చిన ఘనత పివి గారిదిఆర్థిక సరళీకృత విధానాన్ని తీసుకువచ్చి నేటి ఆధునిక కాలంలో మనం వాడుతున్న టీవీలు సెల్‌ ఫోన్లు కార్లకు పునాది వేసిన పీవీ నరసింహారావు గారి చరిత్ర ఎంతో గొప్పది.మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ గారి సాంకేతిక విప్లవాన్ని ఆలోచన విధాన అమలుకర్త పివి నరసింహారావుదేశ స్వాతంత్రానంతరం 60 కోట్ల అప్పు ఉంటే నేటి బిజెపి కేంద్ర ప్రభుత్వంలో గడిచిన తొమ్మిదేళ్లలో 1,50,000 కోట్ల అప్పు దాటిపోయింది.
పీవీ నరసింహారావు గారి రాజకీయ చరిత్ర వారి ఆదర్శ జీవితం అనే అంశాలను స్ఫూర్తిగా తీసుకొని వారిని స్మరించుకుంటూ, వారి ఆశీర్వాదాలతో వారు చూపిన బాటలో నడుస్తూ భవిష్యత్తులో రాజకీయ ప్రక్షాళన జరిగి వారు ఆశించిన విధంగా నిజాయితీగల రాజకీయాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాము అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking