తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గౌలిగూడ లోని విఠలేశ్వరస్వామి ఆలయంలో పట్టువస్త్రాలను సమర్పించిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతనిధి:తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గౌలిగూడ లోని విఠలేశ్వరస్వామి ఆలయంలో పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ముందుగా మంత్రికి ఆలయ నిర్వహకులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.

 

పూజల అనంతరం మంత్రిని ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహకులు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, కిషన్‌యాదవ్‌, గోషామహల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి నంద కిషోర్‌ వ్యాస్‌, నాయకులు ఆనంద్‌ గౌడ్‌,గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, మహేందర్‌ ,మాజీ కార్పోరేటర్‌ రామచంద్రరాజు బీజేపీ నాయకులు గోల్కోండ జిల్లా బీజేపీ అధ్యక్షులు పాండుయాదవ్‌ ,వై.క్రిష్ణ ,బి.వెంకటేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking