ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26 : ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి అని దండేపల్లి మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య అన్నారు.గురువారం మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య మాట్లాడుతూ…ఈ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్న వెరబెల్లి రఘునాథ్ గతంలో అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిత్యం మంచిర్యాల ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజ సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రఘునాథ్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏమైనా ఏ ఆపద జరిగిన ఆర్థికంగా ఎంతో ఎంతోమంది కార్యకర్తలను ఆదుకోవడం జరిగింది.ఈ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేయడంలో కృషి చేసిన వ్యక్తి రఘునాథ్,రఘునాథ్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు స్కూళ్లలో బుక్స్,బ్యాగ్స్ పంపిణీ చేయడం గ్రామాలలో పేద కుటుంబంలో నుంచి ఎవరినైనా కోల్పోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం కరోనా టైంలో ఎంతోమందికి మెడికల్ కిడ్స్ అందజేసి వారిని కరోనా నుంచి కాపాడడం జరిగింది ఉద్యోగ అవకాశాల కొరకు స్టూడెంట్స్ కు కోసింగులు ఈ విధంగా ఈ నియోజకవర్గంలోఎన్నో కార్యక్రమాలు చేస్తే అన్ని పార్టీలు రఘునాథ్ ని చూసి కడగడలాడుతుంటే ఏ కార్యకర్తకు సంబంధం లేని వ్యక్తులు పార్టీ కొరకు పనిచేయని వ్యక్తులు పార్టీలో చేరని వ్యక్తులు గ్లోబల్ ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తే అటువంటి పుకార్లను ఎవరు నమ్మకుండా పార్టీ సిద్ధాంతంకు పార్టీకి క్రమశిక్షణకు నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తుంది.ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జి గుండ ప్రభాకర్,మండల ప్రధాన కార్యదర్శి బందెల రవిగౌడ్,బండే సత్యం,ముత్తినేని మల్లేష్, కిషన్,దార శేఖర్,రాకేష్,సంజువ్ వెంకటేష్,శేఖర్,రాజేందర్,కిషన్,
గుండా రవీందర్,సంతోష్, అంజన్న,వెంకటేష్,శ్రీధర్, బక్కన్న,శ్రీనివాస్,భీమన్న, శేఖర్,సాయి గణేష్,తదితరులు పాల్గొన్నారు.