వరంగల్ రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం.

 

భారీగా తరలివచ్చిన ప్రజలు.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 17:
వరంగల్ నగరంలో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయింది శుక్రవారం మధ్యాహ్నం మామునూర్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వరంగల్ చౌరస్తాలో పాదయాత్రను ప్రారంభించి ప్రధాన రహదారి వెంట నడుచుకుంటూ వెళ్లారు ఆయనతో పాటు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి కొండ సురేఖ కొండ మురళీధర్ రావు మెల్లగా ప్రజలు అన్ని డివిజన్లో నుండి భారీ సంఖ్యలో పాల్గొనడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన రోపే మధ్యలో నడుచుకుంటూ వెళ్లిన ఆయన మండి బజార్ మీదుగా పోచం మైదాన్ చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన కారణం మీటింగులో కొండ సురేఖతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చి సస్యశ్యామలంగా ఉండడం కోసమే అని అయితే
తెలంగాణా సంపద ఒక కల్వకుంట్ల కుటుంబానికే చేరుతుందనీ ప్రజల స్థితిగతులు మారలేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1 లక్ష కోట్ల రూపాయలు కెసిఆర్ ఇంట్లో వేసుకున్నారనీ,
అవినీతికి పరాకాష్ట కెసిఆర్ కుటుంబం అని అన్నారు.
దళిత బంద్ పథకం లో ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు లబ్ధిదారుల దగ్గర తీసుకుంటున్నారనీ,
ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు కట్టించారో ఎంతమందికి ఇచ్చారు ఇప్పటివరకు తెలపలేదనీ విమర్శించారు.
తెలంగాణా లో 20 లక్షలు కుటుంబాల భూమినీ , ధరణి పేరుతో గుంజుకున్నాడని అన్నారు.
కెసిఆర్ కాంగ్రెస్ ఏం చేసిందనీ అంటారనీ ,కెసిఆర్ చదువుకున్న కళాశాల కట్టిచింది కాంగ్రెస్సే అని,
ఐటీ కాయపియటల్ నిర్మించింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు.
మా సర్కారు వొస్తే కేవలం 500 రూపాయలేకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని అన్నారు.
తెలంగాణా మహిళలు బస్ లో తిరిగితే ఒక రూపాయి ఇవ్వనవసరం లేదనీ
ప్రతి నెల మహిళా ల బ్యాంక్ అకౌంట్ లో 2500 నేరుగా డబ్బులు వేయడం జరుగుతుందనీ,
ప్రతి వ్యవసాయ కార్మికునికి 15000 ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుందనీ
రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తాంమని స్పష్టం చేశారు. గృహ జ్యోతి పథకం లో ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఉచితమని, గృహ నిర్మాణం కోసం 5 లక్షలు,విద్యార్థులను 5 లక్షల ఈవ్వడం జరుగుతుందనీ
బిఆర్ఎస్,బిజెపి పార్టీ లు రెండు ఒకటేనని,
కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మేలు చేస్తు తెలంగాణ ప్రజలకు అన్యాయ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కుల గణన చేయడం జరుగుతుందనీ
ఓ బిసి రిజర్వేషన్స్ను అమలు చేస్తామని అన్నారు.
దేశానికి అర్ఎస్ఎస్ పెద్ద ప్రమాదమని , బిజెపి తో మత రాజకీయం చేస్తున్నాయనీ ఇది ప్రజలు గమనించాలని అన్నారు.మా ఉద్యమం బిజెపి టీఆరెఎస్ పైనే అని ఒకరు దేశంలో మరొకరు రాష్ట్ర లో ఉన్నారని
మోదీ ఇక తెలంగాణా లో కనిపించరనీ అన్నారు.
లోక సభలో బీజేపీ వారు టీఆర్ఎస్ ఎంపీ లకు కనులతో సైగ చేసే వారనీ వారి సైగలకు బి.ఆర్.ఎస్ వాళ్లు తలలు ఊపే వారని అన్నారు.
ఏంఐఎం పార్టీ బిజెపి పార్టీ నీ బలపరిచేదుకు ప్రయత్నం చేస్తుందనీ, కొన్ని రాష్ర్టాలలో,
తెలంగాణా నుండి కెసిఆర్ ను పంపించి వేయడం మా ప్రధాన లక్ష్యం,గా పెట్టుకున్నాం అని అన్నారు.
మొదటి క్యాబినెట్ మీటింగ్ లో 6 గ్యారెంటీ పథకాల మీద మొదటి సంతకం ఉంటుందని,
రైతులకు 15000 రూపాయల ఇవ్వడం జరుగుతుందనీ అన్నారు.
తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి వారికి ధన్యవాదాలు తెలియజేసినరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు, సుస్మిత పటేల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking