వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూర్తి అయిన సందర్భంగా సోమవారం రోజున ఆలయ ఉద్యోగుల యూనియన్ తరపున రాజన్న ఆలయ ఈవో కే.వినోద్ రెడ్డికి శాలువాలతో సత్కరించి, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు జయకుమారి, శ్రావణ్ కుమార్, అశోక్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్లకు పురాణం వంశీ, బొడుసు మహేష్, లతా దేవి, మమతలతో పాటుగా ప్రధానార్చకులు మామిడిపల్లి రాములు, చంద్రగిరి శరత్, గోపన్నగారి రఘు గౌతమ్, కూరగాయల శ్రీనివాస్, మరియు సుశీల్ పెంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.