ఎంపీడీవో కు వినతిపత్రం సమర్పిస్తున్న పండితాపురం గ్రామస్తులు
ఇల్లందు ప్రతినిధి ఏప్రిల్ 7 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైన సంతగా పేరుపొందిన కామేపల్లి మండలం పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత ఈ సంవత్సరం రెండు కోట్ల 42 లక్షల 30 వేల రూపాయలకు వేలం నిర్వహించబడింది. ఇంత పెద్ద ఎత్తున సంతకు నిధులు తద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం ఉన్నప్పటికీ సంతలో కనీస సౌకర్యాలు లేకపోవడం గమనార్హం ఈ విషయంపై పండితాపురం గ్రామస్తులు సోమవారం నాడు కామేపల్లి ఎంపీడీవో కు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు సంతకు మంగళవారం రాత్రి పూట పశువులను రైతులు బేరగాళ్లు తీసుకొని రావడం వల్ల విద్యుత్ సౌకర్యం సరిగా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని నీరు సౌకర్యం సరిగా లేకపోవడం వలన ఎప్పుడో ఉన్న పాత నల్లాల నుండి నీరు రాకపోవడం, ఎప్పుడో వేసిన బోరు తప్ప మళ్ళీ కొత్తగా పెరుగుతున్న జనాభాకు నీటి సౌకర్యం అందకపోవడం వలన పశువులు జీవాలు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేసవికాలంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఉందని వివరించినట్లు తెలిపారు ఇంకా రెండు బోర్లు వేసి నల్లాలు, హౌస్ లు కట్టించాలని, అంతేకాకుండా సంతలో తరచుగా జేబు దొంగతనాలు, మరియు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించడం జరుగుతూ ఉంది. రోడ్లపై దుకాణాలు పెట్టడం వలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి ప్రమాదాలు జరుగుచున్నవని, పోలీస్ వారి మరియు గ్రామపంచాయతీ సిబ్బంది సహకారం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఇచ్చిన వినతి పత్రంపై ఎంపీడీవో స్పందించి సత్వరమే పశువుల సంతలోని సౌకర్యాలను మెరుగుపరచగలమని, సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని తెలిపినట్లుగా గ్రామస్తులు వివరించారు ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య గుగులోత్ రవి మరియు తదితరులు పాల్గొన్నారు