రాజన్న ఆలయంలో వైభవంగా రాములోరి కళ్యాణం ఏర్పాట్లు.

అధికారుల సమావేశంలో సూచించిన వేములవాడ ఆర్టీవో రాజేశ్వర్.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ) ప్రతినిధి:- దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ యందు తేదీ30-03-2025 నుండి06-04-2025 వరకు 8 రోజులపాటు ఉగాది మరియు శ్రీరామ నవరాత్రి ఉత్సవములు వైభవంగా నిర్వహించుటకు మంగళవారం రోజున ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ నందు వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు మరియు సంబంధిత ప్రభుత్వాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్డిఓ రాజేశ్వర్ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయ ఈవో కె. వినోద్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ నవమికి వచ్చు భక్తులకు మంచినీటి సరఫరా మరియు ప్రత్యేక క్యూ లైన్ ల ఏర్పాటు, పారిశుద్ధ్యపు పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక లాంటి ఏర్పాట్లు నిర్వహించబడును అని తెలియజేశారు.
వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఎటువంటి అనారోగ్యపరమైన సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ వారిని కోరారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు అరటి పండ్లు మరియు అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాణా అధికారి వినోద్ రెడ్డి తెలిపారు.
మహాశివరాత్రి జాతర ఏవిధంగానైతే అన్ని శాఖలు సమన్వయతో విజయవంతం చేశారో, అదేవిధంగా శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆర్డీవో రాజేశ్వర్ సమావేశంలో హాజరైన వివిధ శాఖల అధికారులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking