న్యాయవాదిని అతి దారుణంగా చంపడం పిరికిపంద చర్య.

 

చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.

వేములవాడలో హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ.

బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం), ప్రతినిధి:- సోమవారం రోజున రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాపు ఇజ్రాయల్ ను హైదరాబాద్ నగరంలోని చంపాపేట ప్రాంతంలో పట్ట పగలు నడిరోడ్డుపై దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపడాన్ని నిరసిస్తూ వేములవాడలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించినట్లు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. మంగళవారం రోజున హత్యకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో కలిసి నిరసన తెలిపిన అనంతరం సదానంద మాట్లాడుతూ దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, న్యాయస్థానాలలో కక్షిదారుల కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న న్యాయవాదులను చంపడం దారుణమైన చర్య అని, న్యాయవాదిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్న దస్తగిరి పై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకువచ్చి, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, రేగుల దేవేందర్, విద్యాసాగర్ రావు, పొత్తూరి అనిల్ కుమార్, పిట్టల మనోహర్, పెంట రాజు, పురుషోత్త, గోపికృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొంటి శంకర్, కటకం జనార్ధన్, రేగుల రాజ్ కుమార్, గుజ్జే మనోహర్, పంపరి శంకరయ్య, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీష్, నాగేంద్రబాబు, మహిళా న్యాయవాది అన్నపూర్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking