ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 19 :
మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్లో ఎస్.ఓ.టు జి.ఎం విజయ్ ప్రసాద్ అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో సీ.ఎం పి.ఎఫ్ రీజినల్ కమిషనర్-1 హరి పచౌరి పాల్గొన్నారు. ఈసందర్భంగా మందమర్రి ఏరియా యూనియన్ నాయకులు మరియు అధికారులతో కొత్త పెన్షన్ క్లెయిమ్స్, ప్రావిడెంట్ ఫండ్, సీ.ఎం.పి.ఎ.ఫ్ (భవిష్య నిధి), తదితర అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రెటరీ దాగం మల్లేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డీజీఎం ఎఫ్ అండ్ ఎ ఆర్ వి ఎస్ ఆర్ కే ప్రసాద్, డివైపిఎం ఎండి ఆసిఫ్, యూనియన్ నాయకులు, అన్ని గనుల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.