రైస్ మిల్లర్లు కేటాయించిన ధాన్యం వెంటనే దింపుకోవాలి

… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, జూన్ 01 ప్రజ బలం ప్రతినిది:
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు ,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ధాన్యం తరలింపు, అన్లోడ్ చేసుకోవడం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలన్నారు. ధాన్యం లారీలు దింపుకోని వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ కు ఆదేశించారు.
ధాన్యం సకాలంలో దించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకుని ధాన్యం లారీలు వచ్చిన వెంట వెంటనే అన్లోడ్ చేయాలని సూచించారు.
రైస్ మిల్లులకు వెళ్లిన లారీలన్నీ ధాన్యం అన్లోడ్ అయిన వెంటనే తిరిగి నేరుగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలన్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తమ డ్రైవర్లకు కొనుగోలు కేంద్రానికి వెళ్లాలని కచ్చితమైన సూచనలు చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాలలోనూ సీరియల్ నంబర్ పాటించాలని, ఎవరు మొదటగా కాంటా వేస్తారో వారివి మొదటగా లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపాలని సూచించారు.
ప్రతిరోజు లక్ష్యం మేరకు ధాన్యాన్ని దింపుకోవాలని, రోజువారి నివేదికను మిల్లుల వద్ద ఉన్న పాయింట్ పర్సన్, డిప్యూటీ తాసిల్దార్ నుండి రావాలన్నారు.
లారీలు సక్రమంగా వెళ్లాలని, డ్రైవర్లు సరిగ్గా ఉండేలా చూడాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి రైస్ మిల్లు వద్ద దశాబ్ది ఉత్సవాల ఫ్లెక్సీ/పోస్టర్ను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు . అదేవిధంగా పారిశ్రామిక దినంను నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వనజాత, డి ఎం సుగుణ బాయ్, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking