దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ

సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిల్లీ మేరీ
హైదరాబాద్ జూన్ 1 ():1969లో తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలలో స్వరాష్ట్రకాక్ష బలంగా వినిపించినప్పటికీ కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల వల్ల రాష్ట్రం సిద్ధించలేదు ఆ తరువాత అనుకున్న స్థాయిలో ఉద్యమం జరగలేదు అప్పుడే కెసిఆర్ మదిలో మిగిలిన ఆలోచన మెదిలిన ఆలోచన తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర ఏర్పాటు ఏ కేక ఏజెండాగా ముందుకు సాగాలని దృఢ సంకల్పంతో ఏప్రిల్ 27 2001న అప్పటి శాసనసభ ఉపసభాపతి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు దాదాపు 13 సంవత్సరముల పాటు దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేశారు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోసం ఆ ప్రాంతంలో లోని 10 జిల్లాలలో లోని ప్రజలను సంఘటితం చేసుకుంటూ చేస్తూ సడక్ బంద్ రైలు రోకు సకల జనుల సమ్మె లాంటి కార్యక్రమములను నిర్వహించారు కెసిఆర్ మలిదశ ఉద్యమాన్ని ఉద్యమాల పొలిటిగడ్డ సిద్ధిపేటలో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా నవంబర్ 29 2009న దీక్షను నిర్వహించేందుకు కరీంనగర్ నుండి సిద్దిపేట లోని సవాస్తాలకు బయలుదేరిన కేసీఆర్ను అలుగునూరు వద్ద సభాస్థలికి కెసిఆర్ ను పోలీసు అరెస్టు చేసి ఖమ్మం తరలించారు ఈ విషయం తెలుసుకొని అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఉద్యమం కోసం తన ప్రాణాలను బలివ్వడానికి కూడా వెనుకాడ లేదు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు మద్దతుగా దీక్షలు ర్యాలీలు బందులు కొనసాగాయి ఉద్యమంలో భాగంగా రైల్ రోకోలు వంటావార్పు సడక్ బందు అంటే అనేక కార్యక్రమాలు చేపట్టారు.
2001లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేయబడుతుంటే ఎంతోమంది మేధావులు రాజకీయ నాయకులు హేళన చేశారు.కాని రాష్ట్రం ఏర్పడితే ఎన్ని ఫలితాలు ఉంటాయో అని విద్యావంతులకు, కవులకు, మేధావులకు కేసీఆర్ వివరించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో హరీష్ రావు పాత్ర కీలకంగా ఉంది. కెసిఆర్ కు అండగా ఉంటూ తనదైన శైలిలో ఉద్యమాన్ని నడిపించినారు హరీష్ రావు . 2001 నుండి 2014 వరకు మళ్లీ దశ ఉద్యమంగా పోరాటం చేశారు. ఒక వ్యక్తితో మొదలై వందల మంది మద్దతు పలికారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు
తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారి పాత్ర
తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున కొనసాగుతున్న కొనసాగడంలో ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే ప్రస్తుత ఆర్థిక మంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పాత్ర ఎంతో కీలకమైనది ఉద్యమంలో నిత్యం కెసిఆర్ వెన్నంటే ఉంటూ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు తెలంగాణ ప్రాంతం నీళ్లు నిధులు నియామకాలలో ఏ విధంగా దోపిడీకి గురవుతుందో గణాంకాలతో సహా ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలలో ఉద్యమ ఉద్యమ స్ఫూర్తి నింపారు తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి వెనకాడను గొప్ప తెలంగాణ వాది మన హరీష్ రావు గారు రాష్ట్ర అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించే వ్యక్తి సిద్దిపేట జిల్లా ఉద్యమాల జిల్లాను సర్వతోముఖాభివృద్ధికి చేయించడంలో హరీష్ రావు గారిది గారిదే హరీష్ రావు కృషితో సిద్దిపేట జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచింది అనడంలో సందేహం లేదు
తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ పాత్ర :లిల్లీ మేరీ
తెలంగాణ వైద్య ఆరోగ్య జేఏసీ సెప్టెంబర్ 21 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి లో తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో (నర్సింగ్) ఆధ్వర్యంలో 42 రోజులపాటు గాంధీ హాస్పిటల్ యందు నిరాహార దీక్షను తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ గాంధీ ఆస్పత్రి జనరల్ సెక్రెటరీ శ్రీమతి లిల్లీ మేరీ ఆధ్వర్యంలో 42 రోజులపాటు గాంధీ హాస్పిటల్ యందు నిరాహారదీక్ష చేయడం జరిగింది. ఈ సమ్మె ద్వారా ప్రపంచానికి తెలంగాణ ఆస్తిత్వ పోరాటాన్ని తెలపగలిగాము. ఈ సమ్మె వల్ల తెలంగాణ ద్రోహులు ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఉద్యోగ నియామకాల్లో ఎంత దోపిడీ జరిగిందో దీని ద్వారా తెలుస్తుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే సమ్మెగా 42 రోజులపాటు అద్భుతమైన సమ్మె జరిగింది.
తెలంగాణలో ప్రభుత్వము నర్సింగ్ ఆవశ్యకతను గుర్తించి ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పటివరకు 16 కళాశాలలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగినది. మిగిలిన కళాశాలలో కూడా త్వరలో ప్రారంభిస్తున్నారు. దీనితోపాటు ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు చదువులు భారం కాకూడదని ఉద్దేశంతో స్టిపొండ్ పెంచడంతోపాటు విద్యార్థినిలు వారికి మెరుగైన విద్యను అందించటంలో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయంలో మనమందరము మన ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిల్లీ మేరీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking