బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా శ్రీనివాస్ రావు

హైదరాబాద్ జూన్ 1);జాతీయ బిసి సంక్షేమ సంఘం తెలంగాణా రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా తుమరాడ శ్రీనివాస్ రావు నియమితులైనారు.ఈ మేరకు జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభలలో 50 శాతం సీట్లు అదనంగా పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ఈ సీట్లు ఇవ్వాలి. విదేశీయులైన ఆంగ్లో-ఇండియన్లుకు నామినేటెడ్ యం.యల్.ఏ లూగా, యం.పి.లుగా ఇస్తున్నారు. కాని ఈ దేశంలో పుట్టిన అత్యంత వెనుకబడిన కులాలకు ఇవ్వడం లేదు. అందుకే అత్యంత వెనుకబడిన కులాలకు ఇంతవరకు అసెంబ్లీకి పార్లమెంటు కడప తొక్కని కులాలకు ఆంగ్లో –ఇండియన్ల మాదిరిగా నామినేటెడ్ యం.యల్.ఏ / యం.పి లు ఇవ్వాలని కోరారు. శ్రీనివాస్ రావు ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం తెలంగాణరాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా కొనసాగుతూ తూర్పు కాపు సంక్షేమం కోసం కృషి చేస్తూ తనకంటూ గుర్తింపు పొందారు.అతని సేవలను గుర్తించిన ఆర్. కృష్ణయ్య బిసి వర్గాలకు చెందినా 139 కులాలకు సేవలందించాలని కృష్ణయ్య కోరారు.అనంతరం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తనపై గల నమ్మకం తో తనకు ఈ పదవిని కేటాయించిన ఆర్. కృష్ణయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.బిసి ల హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking