సాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ జూన్ 1 ();తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ – 2023 ముగింపు వేడుకలు నగరంలోని 6 స్టేడియాల్లో ఘనంగా నిర్వహించారు. ఎల్‌బి స్టేడియంలో సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హాజరైనారు. సాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, సీఎం కప్ నిర్వహణ ఘట్టం క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇది ఒక నూతన ఓరవడి అని ఆయన అన్నారు. ఈ కప్ విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాట్స్ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. 618 మండలాలు, 33 జిల్లాలు రాష్ట్ర స్థాయిలో, 6 స్టేడియాలు 18 క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీలో ఎంతో మంది నిబద్ధతో చిత్త శుద్ధితో కృషి చేసిన మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులకు, సిబ్బంది, కోచ్‌లు, వ్యాయామ, ఉపాధ్యాయులకు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. క్రీడల్లో పాల్గొనే వారికి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని గుడి, బడి లాగే మైదాన్ కూడా పవిత్ర స్థలాలా జాబితాలో చేరిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సాట్స్ ఓఎస్‌డి డా॥ కె. లక్ష్మీ, డిప్యూటి డైరెక్టర్లు శ్రీమతి సుజాత, ధనలక్ష్మి, చంద్రారెడ్డి, అనురాధ, ఓలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సరూర్‌నగర్‌లోసరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్, కబడ్డీ, జిమ్నాస్టిక్స్ విభాగాల ముగింపు ఉత్సవాల్లో శాసన మండలి ఛైర్మన్ గుతా సుఖేందర్ రెడ్డి, సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. వాలీబాల్, కబడ్డీ ఫైనల్ పోటీలను వారు తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేసి, పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికేట్లు ప్రధానం చేసారు.
