బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా
బిఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్
ప్రజాబలం – కొల్చారం మండలం 13.09.2024:
మెదక్ జిల్లా కొల్చారం మండలం మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తదితరుల అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ కు వెళ్ళడానికి సిద్దమైన బి ఆర్ ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు..ఈసందర్బంగా గౌరీ శంకర్ సంతోష్ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేస్తే.. వ్యాంగ్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యం ను ఖునీ చేశాడన్నారు. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే గా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ప్రజా పద్దుల చైర్మన్ పదవి ని అరికపూడి గాంధీ కి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తాను బి ఆర్ ఎస్ లోనే ఉన్నానని గాంధీ చెప్పడం సిగ్గుచేటన్నారు.. పాడి కౌశిక్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అరికపూడి గాంధీ, అయన అనుచరులను స్వేచ్ఛగా ఎమ్మెల్యే పై దాడి చేసేలా సహకరించారని ఆరోపించారు.. గాంధీ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్ కు రావాలని, రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు..శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తో సహా ఎమ్మెల్యే లను, బి ఆర్ ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించారు.. హరీష్ రావు గాయపడ్డా దౌర్జన్యం గా తీసుకెళ్లడం వారి ఆరాచకానికి నిదర్శనమన్నారు.. అరెస్ట్ యూత్ విభాగం అధ్యక్షులు సంతోష్ రావు యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి ఆర్య రవీందర్ టిఆర్ఎస్ శ్రేణులను హౌస్ అరెస్టు చేశారు
