ఆరెంజ్ హాస్పిటల్ డాక్టర్స్ టీం ను సత్కరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ జూలై 1 ();డాక్టర్ డే రోజు పురస్కరించుకొని ఆరెంజ్ హాస్పిటల్ చైర్మన్ తో పాటు ఆరెంజ్ హాస్పిటల్ డాక్టర్స్ టీం ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన కేకు ను కట్ చేసారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హాస్పిటల్ డాక్టర్ ను సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు డాక్టర్ తన జీవితంలో సంతోషం ఎపుడు ఉంటుంది అంటే. తమ దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు మాత్రమే మాకు సంతోషం అంటున్నారు. ఇంతటి నిష్ఠ కలిగిన ఆరెంజ్ హాస్పిటల్ డాక్టర్స్ టీం ను సత్కరించి నందుకు నాకూ చాలా సంతోషంగా ఉందని ప్రవీణ్ కుమార్ వివరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, డాక్టర్ హరీ ప్రకాష్, డాక్టర్ క్రాంతి, మేడి పాపయ్య, ధర్మేందర్, సంద్రపల్లి వెంకటయ్య లను కూడా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking