ఎమ్మెల్యే నివాస ప్రాంగణం లో శబరిమలవైభవం

 

వైభవంగా మహాపడి పూజ..

గురుస్వామి జ్యోతిశాస్త్ర కుంభాభిషేక నిపుణులు శ్రీమన్ శ్రీ సి వెంకటేశ్వర శర్మ గారి నేతృత్వంలో

వేద మంత్రాల మధ్య ఘనంగా జరిగిన అయ్యప్ప పడిపూజ

నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి నూతన స్వగృహం నందు వైభవోపేతంగా జరిగిన స్వామి అయ్యప్ప మహా పడి పూజోత్సవం

నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన అయ్యప్ప, మాలాదారులు , భక్తులు, నేతలు కార్యకర్తలు

అయ్యప్ప స్వామి ఎక్కడో ఉండరని, మాలాధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అన్నారు.
అయ్యప్ప దీక్ష చాలా గొప్పదని, కులమత, ప్రాంత, వర్ణ, వర్గాలకు అతీతంగా ప్రతిఒక్కరూ మాలధరిస్తారని, అయ్యప్ప వారిలోనే కొలువై ఉంటారని అన్నారు. ప్రతీ ఒక్కరు వారి వారి ఆచారాలకు తగిన విధంగా దైవ చింతన ను కలిగి ఉండాలని, అలా చేయడం వల్ల మనసు అదుపు లో ఉంటుందని తెలిపారు.. మనసు లో అదుపు లో ఉంటే చెడు వైపు మన దృష్టి వెల్లదని తెలిపారు.నియెజకవర్గ ప్రజలు ప్రతీ ఒక్కరు అష్ట ఐశ్వర్యాలు , ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ని వేడుకుంటున్నాని తెలిపారు. నకిరేకల్ లోని ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి నూతన స్వగృహం నందు అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజోత్సవం లో కుటుంబ సభ్యులతో కలిసి పడి పూజ ను నిర్వహించారు. నియోజకవర్గ నలుమూల నుండి వందలాది తరలి వచ్చిన స్వాములు
స్వామి శరణం..అయ్యప్ప శరణం.. అంటూ ఆలపించిన కీర్తనలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యం లో మునిగిపోయాయి. ఎమ్మెల్యే గారు స్వయంగా కుమారుడి తో కలిసి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, చక్రస్నానం, జలాభిషేకంతో సుమారు 5 గంటలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామికి ప్రత్యేక పూలతో పుష్పాభిషేకం నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు స్వాములు అల్పాహార ప్రసాదాలను వడ్డించారు. ఘనంగా నిర్వహించిన మహాపడిపూజలో స్వామి శరణు ఘోషతో పన్నాలగూడెం మార్మోగింది. పడి సన్నిధానాలు, గురుస్వాములు, రుత్విజుల వేద మంత్రోచ్ఛరణలు, శరణుఘోషతో అత్యంత వైభవంగా మహాపడిపూజ సాగింది కార్యక్రమం లో పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిలుగా
గురుస్వామి పాల్గొన్నారు…..

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, వివిధ హోదాలో ఉన్న నాయకులు , కార్యకర్తలు , అభిమానులు ,శ్రేయోభిలాషులు , బంధుమిత్రులు పాల్గొన్నారు..

   

Leave A Reply

Your email address will not be published.

Breaking