శామీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాల ఆకస్మిక తనిఖీ

 

మధ్యాహ్న భోజనం రుచిగా పరిశుభ్రంగా ఉండాలి

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 23:
విద్యార్థులకు సన్నబియ్యంతో అందించే మధ్యాహ్న భోజనం రుచిగా పరిశుభ్రంగా ఉండాలని శామీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహాణను పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టరు శామీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థులకు సన్నబియ్యంతో అందించే మధ్యాహ్న భోజనం రుచిగా పరిశుభ్రంగా ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అదనపు కలెక్టరు సూచించారు. అదనపు కలెక్టరు పాఠశాలలోని తరగతి గదులను తిరిగి పరిశీలించారు. వంటశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా కష్టపడి బాగా చదువుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకొవాలని అదనపు కలెక్టరు విద్యార్థులకు బోధించారు. మధ్యాహ్న భోజనం రోజు పెడుతున్నారా, భోజనం ఏలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టరు భోజనం చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking