వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పేదవారికి ఆర్. కే. వై టీం సభ్యులు గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు…
ఈరోజు ఆర్ కే టీం అధ్యక్షులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, మరియు ఫుట్ పాత్ ల పై నివసిస్తున్న అభాగ్యులకు, సంతలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు అతిగా కురుస్తున్న వర్షాలకు తలదాచుకోవడానికి గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేర్లింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా గోపనపల్లిలో ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అతిగా కురుస్తున్న వర్షాలకు తలదాచుకోవడానికి గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న RKYటీం సభ్యులను అభినందిస్తూ, ఎక్కడ ఆపద సంభవించిన ముందుండి తమ వంతు సహాయంగా ఆర్ కే వై టీం సభ్యులు సహాయ, సహకారాలు అందించడం ఎంతో అభినందించవలసిన విషయం అని తెలుపుతూ వేసవికాలంలో చలివేంద్రాలు, వర్షాకాలంలో గొడుగులు, చలికాలంలో దుప్పట్లు అనేక సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టి రవి కుమార్ యాదవ్ తరఫున పేదవారికి మీకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నందుకు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా, రాజకీయాల కోణంలో కాకుండా సేవ చేయడంలో మా సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్ కే వై టీం సభ్యులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
కార్యక్రమంలో టీం సభ్యులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ జాజి రావు శ్రీనివాస్,j రాము, నరేష్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు , శంకరయ్య మొదలగు వారు పాల్గొన్నారు.