నిజాంపేటలో మొక్కలు నాటిన ఎంపీడీవో
ప్రజాబలం- మెదక్ నియోజకవర్గo, నిజాంపేట్
మెదక్ జిల్లా నిజాంపేట మండలం పట్టణ కేంద్రంలో గురువారం అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమంలో భాగంగా చెట్ల మొక్కలు నాటుతున్నామని స్థానిక ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 14 గ్రామపంచాయతీలకు సంబంధించి అమ్మ పేరిట మొక్కలు నాటడం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి మహిళలు ప్రజలు ముందుకు వచ్చి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు