15 ఎకరాల ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా. 28 ఏప్రిల్ 2023 ప్రజాబలం ప్రతినిధి గెంట్యాల ఆంజనేయులుఎగువ మానేరు డ్యాం పరిసర ప్రాంతాలలో ముంపు కాకుండా మిగిలిన 15 ఎకరాలలో హరితహారం కింద మొక్కలు నాటాలని జిల్లా స్థానిక సంస్థల జిల్లా దిన కలెక్టర్ బి సత్యప్రసాద్ ఇరిగేషన్ అధికారులు ఎంపీడీవోను ఆదేశించారుశుక్రవారం జిల్లా  కలెక్టర్ ఎగువ మానేరు జలాశయం సమీపంలో ముంపు కాకుండా  ఇరిగేషన్ శాఖ కు సంబంధించి మిగిలిన 15 ఎకరాలను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు.ప్రధానంగా డ్యాం కట్ట దిగువన, గెస్ట్ హౌస్ ప్రాంతం, ఇతర ముంపు కాకుండా ఉన్న ప్రదేశాలను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు.ముంపు కాకుండా మిగిలిన 15 ఎకరాలలోనీ మూడు ప్రదేశాల్లో ప్లాంటేషన్ పనులకు వెంటనే చేపట్టలని ఇరిగేషన్ అధికారులు ఎంపీడీవో కు సూచించారు.ఖాళీ భూముల పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ వెంట సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్,  హరితహారం ప్రత్యేక అధికారి సంతు ప్రకాష్, స్థానిక మండల ఎంపీడీవో తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking