రాజన్న సిరిసిల్ల జిల్లా. 28, ఏప్రిల్ 2023: ప్రజాబలం ప్రతినిధి గెంట్యాల ఆంజనేయులు
వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్ కేంద్రాల నిర్వాహకుల ను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ ముస్తాబాద్ మండలం చీకోడ్, నామాపూర్ మరియు పోతుగల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సగటు నాణ్యత ప్రమాణాలు ప్రకారం ధాన్యం ను రైతులు శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెస్తే
కొనుగోళ్లు వేగంగా జరుగుతాయని అన్నారు.
రైతులు ఇందుకు సహకరించాలని కోరారు.
కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని సాధ్యమైనంత వేగంగా రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రాల నిర్వాహకులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చిప్పలపల్లి లోని శ్రీమన్నారాయణ రైస్ మిల్ మరియు నామాపూర్ లోని వీరాంజనేయ రైస్ మిల్ తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వాహనంలో రైస్ మిల్లకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్ యజమానులు అన్లోడింగ్ చేసుకోవాలని ఆదేశించారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులెవ్వరు ధైర్య పడవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు.