స్నేహిత కార్యక్రమం దేశానికే ఆదర్శం కావాలి సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేపడుతున్న స్నేహిత కార్యక్రమం దేశానికే ఆదర్శం కావాలని రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్నేహితా కార్యక్రమం ఫేస్-2లో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్, విద్యా ప్రాముఖ్యత, ఆరోగ్యమైన ఆహార అలవాట్లు ,సెల్ఫోన్ వాడకం ప్రయోజనాలు, నష్టాల గురించి, ఆత్మ రక్షణ గురించి అనే ఐదు అంశాలపై బాల బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ… మన భారతదేశం ను భరతమాత తల్లి గా కొలుస్తాం అలాంటి దేశంలో సాంకేతికత , విద్యా విజ్ఞానం పెంపొందుతున్న క్రమంలో బాలికలపై అఘాయిత్యాలు జరగడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులతోపాటు ,గురువులు చదువుతోపాటు బాధ్యతగా గుడ్ టచ్,బ్యాడ్ టచ్, సంరక్షిత ఇంటర్నెట్, పోషక విలువ గల ఆహారం, క్రీడలు, ఆత్మరక్షణ పై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రతి పాఠశాలలో రోజు అరగంట స్నేహపూర్వక వాతావరణం లో స్నేహిత కార్యక్రమం పై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన స్నేహిత కార్యక్రమంను ఆదర్శంగా తీసుకొని బాల బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు లేని దేశంగా తీర్చిదిద్దుకుందమన్నారు. ఈ కార్యక్రమంలో , సిడిపిఓ శా గంటి శైలజ, ఎంపిటిసి ఎండి.రేహాన్, ఎస్ఎంసి చైర్మన్ రాపోలు సరోజన, స్నేహిత బృంద సభ్యులు శ్రీదేవి, లావణ్య , పుష్ప, ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు అండమ్మ, భార్గవి, శ్రీలత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking