ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొత్తపల్లిలో గురువారం రోజున ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు
కే.సునిత మాట్లాడుతూ… గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలను వచ్చే విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించినట్లయితే సకల సౌకర్యాలతో కూడిన ఉచిత విద్య,ఉచిత ఆహారం, పాఠశాల యూనిఫాం, ఉచిత పుస్తకాలను అందజేస్తాం అని ప్రైవేటు పాఠశాలల కంటే మేరుగైన విద్యాబోధన నిర్వహిస్తామని తల్లిదండ్రులకు తేలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.శ్రీకర్, సిఆర్పి సిహెచ్.ప్రవీణ్, శంకరమ్మ,తిరుమల. ఆశకార్యకర్త గురులక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత పాల్గొన్నారు.