ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ బుకింగ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 10:
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలు పారదర్శకంగా, అవినీతి రహితంగా, సులువుగా, తక్కువ సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ బుకింగ్ పద్దతిని ప్రవేశపెట్టిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం అన్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రారర్ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్నిగురువారం నుండి అమలు పరుస్తున్న ప్రక్రియను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రజలు వారీకి అనుకూలమైన తేది, సమయాన్ని registration.tlangana.gov.in వెబ్ సైట్ లో ఎంపిక చేసుకుని రిజిస్ట్రేష్టన్లకు వచ్చే విధంగా ప్రభుత్వం వెసలుబాటు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని కొన్ని సబ్ రిజిస్ట్రారర్ కార్యాలయాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రారర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా నిర్వహిస్తున్నరిజిస్ట్రేషన్ విధానాన్ని కలెక్టరు వివరింగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఈరోజు ఎన్ని స్లాట్ లు బుక్ అయ్యాయని కలెక్టరు సబ్ రిజిస్ట్రారర్ ను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏలా జరుగుతుందని ఆన్ లైన్ లో క్షణ్ణంగా పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెబ్ సైట్ మాడ్యూల్స్ ను ఆన్ లైన్ ప్రక్రియలో దశల వారిగా ఏవిధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఆన్ లైన్ ఫోటో, స్కానింగ్ చేసే విధానాన్ని కలెక్టరు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ తహసీల్దారు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking