జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
**
ములుగు జిల్లా. ఇంగ్లీష్ పట్ల భయాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని 54 ప్రాథమిక పాఠశాలల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దిశ ఫౌండేషన్, ఈ ఎల్ ఎఫ్ ఇంగ్లీష్ సహకారంతో చేపట్టిన 80 రోజుల
లెర్న్ టు రీడ్ (ఇంగ్లీష్ బోధన కార్యక్రమం) ముగిసిందనున జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లల్లో ఇంగ్లీష్ పట్ల భయాన్ని పోగొట్టి ఇంగ్లీష్ మాట్లాడుటలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు.
వివిధ మండలాల నుండి వచ్చిన 1 నుండి 5 వ తరగతి చదివే విద్యార్థులు ఇంగ్లీష్ లో వారి సెల్ఫ్ ఇంట్రడక్షన్,
రోల్ ప్లే, సంభాషణ మొదలగు అంశాలను ప్రదర్శించగా కలెక్టర్ సంబ్రమాశ్చర్యానికి గురై పిల్లలను, ఉపాధ్యాయులను మరియు దిశా ఫౌండేషన్ వారి కృషిని కొనియాడారు.
తదనంతరం ఉత్తమ ప్రతిబ కనపరిచిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కలెక్టర్ మెమెంటో, సర్టిఫికెట్ లను అందచేశారు.
మొదటి దశలో తీసుకున్న 54 పాఠశాలల్లో ఈ సి ఐ ఎల్ హైదరాబాద్ వారి ఆర్ధిక సహకారంతో చేపట్టిన
ఈ కార్యక్రమం విజయవంతం అయినందున మరో 54 పాఠశాలల్లో చేపట్టాలని మరియు లెవెల్ 1 లో ఉన్న పిల్లలను లెవెల్ 8 వరకు తీసుకెళ్లే వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
దిశ ఫౌండేషన్, ఈ ఎల్ ఎఫ్ ఇంగ్లీష్
వారు మొదటగా గత నవంబర్ లో 54 ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వీడియో లెసన్స్ తో కూడిన డిజిటల్ మెటీరియల్ మరియు వర్క్ బుక్ లను సమకూర్చడం జరిగింది.
ఈ మెటీరియల్ ను ఉపయోగించి ఉపాధ్యాయులు గత డిసెంబర్ నుండి పిల్లలకు బోధన చేయడం మరియు యాక్టివిటీ లు చేయించడం ద్వారా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఇంగ్లీష్ పట్ల భయం పోయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.
గత నెలలో మంత్రి సీతక్క చల్వాయి పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడడం చూసి మంత్ర ముగ్ధులయ్యారు.
ఈ లెర్న్ టు రీడ్ ఇంగ్లీష్ బోధన కార్యక్రమం 80 రోజులు పూర్తి చేసుకొని విజయవంతం అయినందున ఈ రోజు కలెక్టర్ ఆడిటోరియం నందు ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి జి పాణిని, సెక్టోరల్ అధికారి అర్షం రాజు, సాంబయ్య, దిశా ప్రతినిధులు ఐశ్వర్య, ప్రతిభ, వివిధ మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.