విద్య సంవత్సరం ప్రారంభం కి పాఠశాలలు సిద్ధం చేయాలి

 

జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 28 : విద్యా సంవత్సరం ప్రారంభం ప్రారంభంలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి,మరమ్మత్తులు పనులు వేగవంతం చేసి పాఠశాలను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్ అన్నారు.మంగళవారం మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి, మరమ్మతులు పనులను మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి అకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చే విద్య సంవత్సరం పాఠశాల ప్రారంభంలోగా పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, మూత్రశాలలు, విద్యుదీకరణ పనులతో పాటు తరగతి గదుల మరమ్మత్తులు బాలికల కొరకు ప్రత్యేక మూత్రశాలల పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోని తెలిపారు. ఏకరూప దుస్తుల కొట్టు కేంద్రాన్ని సందర్శించి దుస్తుల తయారీ పురోగతిని పరిశీలించారు.తరగతులు ప్రారంభం అయ్యేలోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించే విధంగా కృషి చేయాలని అన్నారు. అనంతరం ఎన్ టి ఆర్ నగర్ అమలివాడ లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిష్కరించారు.ఈ సంవత్సరం వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మురుగు కలలలో ఎక్కడైనా చెత్త చెదారం పెరగకుండా ఎప్పటికప్పుడు పొడిక తీసి శుభ్రంగా ఉంచాలని, తద్వారా వరద నీరు నివాస ప్రాంతంలోని రాకుండా కాలువ ద్వారా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులు శుభ్రంగా ఉండేలా పరిశుద్ధ చర్యలు చేపట్టాలని, రోడ్డుపైన చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని,ఉల్లంగించిన వారికి నిబంధన మేరకు జరినామా విధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking