ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 28 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం డౌడేపల్లి గ్రామానికి చెందిన పోన్నం అంజన్న(29) అనే వ్యక్తి ఇంట్లో దులానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుడు కూలి పని చేసుకునేవారు.గత సంవత్సర కాలంగా కడుపునొప్పి,సైనస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతుండు. కుటుంబసభ్యులు ఆసుపత్రుల్లో చూపించి మందులు వాడిన వ్యాదినయంకాకపోగా రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుని తండ్రి పొన్నం చిన్నయ్య పిర్యాదు మేరకు ఎస్సై-2 రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేయడం జరుగుతుంది, లక్షెట్టిపేట ఎస్సై పి చంద్రకుమార్ తెలుపారు.