గొప్ప స్వతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్

 

చేగుంట ప్రాజబలం న్యూస్ :-

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్ల చేగుంట మండల కేంద్రంలో వీర సావర్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ వీరసావర్కర్ 28 మే 1883న మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సమీపంలోని భాగూర్ గ్రామంలో మరాఠీ హిందూ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో దామోదర్ మరియు రాధాబాయి సావర్కర్ దంపతులకు జన్మించారు అని, వినాయక్ దామోదర్ వీర సవర్కర్ ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది అని,బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవ వీరుడు అని, ఎందరో విప్లవకార్లకు స్వతంత్ర సమర వీరులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వీరుడని, 27 సంవత్సరాలు అండమాన్ జైల్లో దుర్భర జీవితం గడిపిన గొప్ప యోధుడని, 1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదని మొదటి స్వతంత్ర సంగ్రామం అని అన్న మొదటి వ్యక్తి వీరసావర్కరే అని,అంటరానితనం నిర్మూలన గురించి సహాపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన మొదటి సంఘసంస్కర్త అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట తపస్ మండల అధ్యక్షుడు రావుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బాల్ శెట్టి రేఖ, జిల్లా కార్యదర్శులు, ఆంజనేయులు, పట్లూరి యాదగిరి,మరియు తపస్ బాధ్యులు, దేవానంద్, మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్, ప్రవీణ్, పులి రమేష్, సుభాష్ గౌడ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking