వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభను వెలికితిస్తాయి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 28:
తార్నాక నారాయణ ఈ టెక్నో పాఠశాలలో జాతీయ సైన్స్
దినోత్సవ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు తమ మేధాశక్తితో ఛాంద్రయాన్- 3 ని ఎలా ప్రవేశపెట్టారో, అంతరిక్షంలో ఉన్న గ్రహాల ద్వారా ఎలాంటి
ఉపయోగాలో వివిధ రకాల మోడల్స్ భూత, భవిష్యత్,
వర్తమాన కాలాలలో మనకు సైన్స్ ఎంతగా ఉపయోగపడుతుందో
కళ్ళకు కట్టినట్లుగా చిన్నారులు వారి ప్రదర్శనల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శివ నర్సింగ్ హోం మేనేజింగ్ డైరెక్టర్ డా. రమేష్, పాఠశాల ఏ.జి.యం, బాలపరమేశ్వర్ లు మాట్లాడుతూ మనిషిని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకెళ్ళే సాధనమే సైన్సు అన్నారు. నేటి విద్యార్థులే
రేపటి శాస్త్రవేత్తలుగా ఎదిగి మరిన్ని ఆధునిక, వైజ్ఞానిక
పరికరాలను కనుగొని నలుగురికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్, హైస్కూల్ కో-ఆర్డినేటర్ ఆజాద్, ఈ- చాంప్స్ కో-ఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ – కిడ్జ్. కో-ఆర్డినేటర్ నూర్, ఈ చాంప్స్ మేరీ, ఈ కిడ్జ్. ఆస్మా, ఏ.ఓ. మహేందర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking