కడుపు కాలి రోడ్ ఎక్కినం.

మా వెనుక ఎవరూ లేరు.

-మాపై బురద జల్లే నాయకులారా ఖబర్దార్

-వివిధ రాజకీయాల్లో పార్టీల్లో ఉన్న దళిత నాయకులంతా ఏకం కావాలని పిలుపు..

-దళిత బంధు సాధన కమిటీ,

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 28

జమ్మికుంట, దళిత బంధు సాధన కమిటీ నాయకులు జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులైన తాము రెండో విడత దళిత బంధు సాధనకై సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అక్కడికి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేసి కనీసం మహిళను వృద్ధులను చూడకుండా సి టి ఎస్ కు తరలించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు, ఖబడ్దార్ దుష్ప్రచారం చేసే నాయకులారా మీ వైఖరి మార్చుకోకుంటే మీ ఇళ్లను ముట్టడిస్తాం అన్నారు. దళిత రెండవ విడత బంధు మంజూరు చేయకుంటే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే ఏ నాయకుడిని పొలిమేర దాటి తమ గ్రామాల్లోకి తిరగనివ్వమని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీలో ఉన్న దళిత నాయకులు పార్టీ కండువా జెండాలు పక్కనపెట్టి తమ దళిత జాతి పక్షాన నిలబడాలని కోరారు.

-ఖబర్దార్ పత్తి కృష్ణారెడ్డి..

గతంలో ఎమ్మెల్సీ దళిత బందు రెండో విడత ఆపాడని తమకు ఎమ్మెల్యే మద్దతు ఉందని మాపై బురదల చల్లె బదులు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీరు మాకు న్యాయం చేస్తే మేము మీకు మద్దతిస్తాం అంతేకానీ మాపై అవాకులు చేస్తే మాత్రం నీ ఇల్లు ముట్టడిస్తాం అని హెచ్చరించారు. పత్తి కృష్ణారెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి, నీ ఉనికిని చాటుకునేందుకు మమ్ములను వాడుకోవద్దు అని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్,మంద రాజేష్, కోలుగూరి నరేష్, రామంచ రాకేష్,అకినపల్లి ఆకాష్,దసరాపు నాగరాజు,కోర్రి సతీష్,రక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking