ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చొరవతో సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆసుపత్రి పర్యవేక్షకులు డా. సునీల్ కుమార్ తెలిపారు.ఈ పరికరం ద్వారా జనరల్ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ అడ్మిట్ అయిన వారికోసం ఎస్డిపి డోనర్లు అందుబాటులో ఉంటే సదరు పేషెంట్ కు ఉచితంగా ప్లేట్లెట్లు ఎక్కించడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల సారంగాపూర్ మండలం చించొలి (బి) గ్రామానికి చెందిన ఓ మహిళకు 19వేల ప్లేట్ లెట్ కౌంట్ లు ఉంటే జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా ప్లేట్లేట్లు ఎక్కించడం జరిగిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లో ఈ సౌకర్యం వినియోగించుకుంటే సదరు మహిళకు దాదాపు 15వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.కావున జిల్లా ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.