సెక్షన్-1బి, ఇన్-పర్సన్ సెక్షన్’ను తుంగలో తొక్కిన కేంద్రం •శాంతియుత నిరసన దీక్షలో న్యాయ విద్యార్థి నవీన్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 08 : లా స్టూడెంట్స్, న్యాయవాది లేకుండా స్వయంగా కోర్టును ఆశ్రయించే వాళ్ళ హక్కుని ‘సెక్షన్ 1-బి, ఇన్-పర్సన్ సెక్షన్’ క్రమబద్ధంగా పది సంవత్సరాలుగా తుంగలో తొక్కుతూ, ఇప్పటికి పూర్తిగా చంపేశారని
న్యాయ విద్యార్థి నవీన్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ‘సెక్షన్ 1- బి, ఇన్ – పర్సన్ సెక్షన్’ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శాంతి యుత నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ న్యాయం కోసం ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం గ్యారంటీతో ఆర్టికల్ 21, 14 ద్వారా ఇచ్చిన ప్రాథమిక హక్కు అని కేంద్రం కూడా దీనిని కాదనలేదని, కేంద్రం ఉన్నది హక్కులను కాపాడటానికే అన్నారు. ఈ విషయం సీజేఐ చెప్పిన తరువాత కూడా పట్టించుకోవట్లేదన్నారు. ఎందుకంటే జడ్జీలు వస్తారు పోతారు తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం అంటే పర్మనెంట్, మీ దక్షిణ భారతీయులు ఏమి చేసుకుంటారో చేసుకోండని అహంకారంతోనే అని విమర్శలు చేశారన్నారు. వీళ్ళకి ఇంగ్లీషు అంటే నచ్చదు, మెయిల్ రిప్లై ఇవ్వరు ప్లీజ్ సార్ నా ఫైల్ చూడండి అని అడుక్కోవాలని తెలిపారు. తాను హైదరాబాద్ నుంచి అని చెప్తే ఇక అంతే, మళ్ళీ ఫోన్ కూడా లేపరని ఆరోపించారు. ఆర్టిఐ వేస్తే సంవత్సరాలు గడుస్తాయి కానీ సమాచారం రాదన్నారు. కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం పది సంవత్సరాలు అయినా పైన పేర్కొన హక్కును కావాలని తుంగలో తొక్కుతూనే ఉందన్నారు. ప్రధాన న్యాయమూర్తి మాటను నిలబెట్టలేని కేంద్ర ప్రభుత్వం, ఇంకా తెలంగాణ పబ్లిక్ కోసం నిలబడుతది అని ఎలా నమ్మగలం అని ప్రశ్నించారు. దక్షిణ భారతం నుంచి లా స్టూడెంట్స్ లేదా న్యాయవాది లేకుండా స్వయంగా సుప్రీం కోర్టులో పిల్ ఫైల్ చేసిన వారి సంఖ్యను బిజెపి చెప్పాలన్నారు. తెలుగు రాష్ట్రాలను పరిపాలించడం తరువాత విషయం అని, మొదట సుప్రీం కోర్టు ద్వారాలు తెరవాలన్నారు. సుప్రీంకోర్టు ఢిల్లీ వాళ్ళ కోసం మాత్రమే కాదు, సుప్రీంకోర్టు భారత దేశంలోని అందరిదీ అని తాను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని మార్చి 25 న సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్ మదురైలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఢిల్లీలో నివసించని న్యాయవాదులు, న్యాయ విద్యార్థులకు సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కుని కల్పించేందుకు తాను నిరంతరం పని చేస్తూనే ఉంటానని చంద్రచూడ్ తెలిపారని వెల్లడించారు.