ఎన్నికల సామాగ్రి కి భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎన్నికల అధికారిని, కలెక్టర్ ఇలా త్రిపాఠి.

 

 

ఎన్నికల పిటిషన్ గడువు ముగిసే వరకు భద్రత నడుమ ఎన్నికల సామాగ్రి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 05 : ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారిని, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

మంగళవారం రాత్రి జిల్లా పరిధిలో గల ములుగు అసెంబ్లి నియోజకవర్గం చెందిన మహబూబాబాద్ నుండి కౌంటింగ్ ముగిసిన అనంతరం తిరిగి వచ్చిన ఈవీఎంలు, వివి ప్యాట్ లతో పాటు ఎన్నికల సంబంధ పేపర్ లు (సామాగ్రి)ని కలెక్టర్ పరిశీలించి, కలెక్టరేట్ లోని ఈ వి ఎం గోడౌన్ లో భద్రత పరచి, సీల్ వేసి భద్రత కల్పించడం జరిగిందని ఈ సందర్భం గా కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల మెటీరియల్ ను 45 రోజుల పాటు ఎన్నికల పిటిషన్ గడువు ముగిసే వరకు పటిష్ట భద్రతలో, నిత్యం పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, సంబంధిత ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking