సర్వ విఘ్నాలను తొలగించు సిద్ది వినాయక
బాలదండు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి పూజ
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 10
గణపతి నవరాత్రుల్లో భాగంగా సిద్ధి బుద్ధి గణపతి ప్రజల సర్వ విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించాలని జమ్మికుంట పట్టణం లోని 29వ వార్డులో బాలదండు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలదండు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండపంలో నాలుగవ రోజు పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది.గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా బాలదండు గణపతి ఉత్సవ సమితి వారి గణపతి మండపంలో
షోడశ మహా హారతుల పూజా(21రకాలు) నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.బాలదండు గణేష్ ఉత్సవ కమిటీ ఈ సందర్భంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.