రజకులకు అండగా కాంగ్రెస్ సర్కార్

ట్యాంక్ బండ్ పై విగ్రహానికి కృషి

ఇచ్చిన హామీలు అమలు చేస్తాం

రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి

రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 10 : రజకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని,ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టడానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని,కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు.మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి, సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతల అశోక్ తో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాడన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ రంగాలతో పాటు సర్వీస్ సెక్టార్ కూడా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయించింది కేవలం తెలంగాణ సర్కార్ మాత్రమే నన్నారు. అనంతరం రజక సంఘం సీనియర్ నాయకులు ఎనగందుల లక్ష్మణ్ మాట్లాడుతూ… ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకల్లో ఏర్పాటు చేసిన శకటాల్లో వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కళ్యాణం రవి, అంబేద్కర్ సంఘం పట్టణ నాయకులు దొంత నరసయ్య, తోగరు రాజు,గరిసె రవీందర్,రజక సంఘం నాయకులు పట్టణ అధ్యక్షుడు నర్సపూర్ లింగన్న, ఓగేటి బాపన్న, అల్వాల రవి,నస్పూర్ శ్రీనివాస్,నేరెళ్ల మల్లేష్,మందపల్లి తిరుపతి,తాడూరి సాయన్న,గుండార భీమన్న,గుండారపు రాజన్న,పోచంపల్లి సత్యం,వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking