సరికొత్త రికార్డుల నాందికి శ్రీ చైతన్య శ్రీకారం

 

ఇంజనీరింగ్, పిజీ రంగంలోకి అడుగులు

మెట్రో నగరాలకు దీటుగా నాణ్యమైన విద్య బోధన

శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవ వేడుకల్లో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 4 (ప్రజాబలం) ఖమ్మం సరికొత్త రికార్డుల నాందికి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అన్నారు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు లో కిడ్స్ కళాశాలను రూపుమాపుతూ నూతనంగా శ్రీకారం చుట్టిన శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, రీసెర్చ్ సెంటర్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మొదటి విద్యా సంవత్సరం విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థ స్కూల్ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ, పీజీ కళాశాల స్థాయికి ఎదగడంసంతోషదాయకమన్నారు. తమ విద్యా సంస్థలు ఆలోచనలతో విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ఆర్థికంగా మెరుగుపరుచుకునేందుకు పునాదులు వేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి మెట్రో స్థాయి నగరాలకు దీటుగా అత్యధిక పారితోషికం కలిగిన ఫ్లేష్మెట్లను విద్యార్థులకు మార్గంచూపడమేలక్ష్యమన్నారు. తమ వేసే ప్రతి అడుగు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉంటుందని, అటువంటి ప్రేరణ తమ విద్యా సంస్థ కలిగిస్తుందని వివరించారు.విద్యార్థులు కలలు కనే సుందర స్వప్నం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని విద్యాసంస్థలకు దీటుగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు నెంబర్ వన్ స్థానంలో ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీ విద్య మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థల పట్ల ప్రజలలో అసంచలమైన విశ్వాసం ఉండటం వల్ల తమ విద్యాసంస్థలు నేడు ఈ స్థాయికి వచ్చాయని, మీరు చూపే ఆధారభిమానాలు తమను మరింత ముందుకు నడిపించేందుకు దోహదపడుతాయని అన్నారు. ఇంజనీరింగ్ రంగంలో తమ మార్కు ఖచ్చితంగా ఉంటుందని రాష్ట్రంలోనే టాప్ పొజిషన్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లెంపాటి గీతిక మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన విద్యార్థులకు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదిగే రీతిలో బహుళ ప్రాచుర్యం పొందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నామని, అందులో భాగంగా ఐ బి ఎం, సెస్కో, టాస్క్ వంటి ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణమూర్తి, సీఈవో పుట్ట శ్రీనివాస్ , పలువురు అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking