రాజన్న సిరిసిల్ల జిల్లా 27 జనవరి 2024ప్రజాబలం ప్రతినిధిఇటీవల హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియంలో కేలో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ పోటీలు జరగగా రాజన్న సిరిసిల్ల జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి వడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గురు అమ్మాయిలు పాల్గొని సిల్వర్ బ్రాంచ్ మెడల్ సాధించారు లైట్ కాంటాక్ట్ 50 కేజీల విభాగంలో గంగన వేణి ప్రవళిక ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది పాయింట్ ఫైట్ 40 కేజీల విభాగంలో దాసరి రష్మిత తృతీయ స్థానం పొంది బ్రాంజ్ మెడల్ సాధించింది అలాగే వడ్నాల కీర్తన 32 కిలోల విభాగంలో పాయింట్ ఫైట్ లో పాల్గొని ఐదవ స్థానంలో నిలవడం జరిగింది ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మర్యాదపూర్వకంగా ఈరోజు కలవడం జరిగింది. మెడల్స్ సాధించిన విద్యార్థినిలను మెడల్స్ వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు వీరికి కోచ్గా ఎలగందుల శ్రీనివాస్ వ్యవహరించడం జరిగింది. ఎలగందుల శ్రీనివాసులు కూడా శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగిందని స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్నాల శ్రీనివాస్ తెలిపారు