👉 హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్ నియోజకవర్గం ఏప్రిల్ 7( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆదివారంనాడు శ్రీరామ నవమి నీ పురస్కరించుకొని జోగిపేటలోని, ప్రసిద్ధ పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు,ఈసందర్భంగా, ఆలయంలో ఘనంగా నిర్వహించిన, సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు, మంత్రికి ఆలయ అర్చకులు, సాంప్రదాయ బద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు, పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణ నడుమ ఆయనకు సత్కార్యము జరిప్యారు, ఆలయ పరిసర ప్రాంతంలో, భక్తుల సందడి నెలకొంది, ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు, రాముని ధర్మపరాయనత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ, భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలు అన్నారు, అలాంటి మహనీయుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం అని అన్నారు, సీతారాముల కళ్యాణం వైభోగంగా సాగింది
ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగాకల్యాణోత్సవన్ని నిర్వహించారు, రామానుజ చార్యుల సాంప్రదాయ ప్రకారం వేదమంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను వీక్షించారు, భక్తులు ఆనందంగా శ్రద్ధగా కళ్యాణం తిలకించి, ఆధ్యాత్మికతను ఆస్వాదించారు కళ్యాణం అనంతరం పూజలు తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు త్రాగునీరు ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ వంటి ఏర్పాట్లు చేశారు, స్వామివారి కల్యాణోత్సవంకు భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు ప్రశంసనీయంగా నిలిచాయి జోగిపేట పబ్బతి హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి, రాష్ట్ర మంత్రి హాజరైన నేపథ్యంలో ఈ వేడుకకు మరింత పటిష్టత మహత్యం చేకూరింది, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….
