బంగారం స్మగ్లింగ్ కేసులో జోగాపూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్.

 

సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించగా మరో ఇద్దరు పరారీ.

పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ అనునతడు సౌదీలో తక్కువ ధరకు నాణ్యమైన బంగారం వస్తుందని, సౌదీలో పనిచేసే తన బావ అయిన రవీందర్ కు చెప్పగా అతను రాంప్రసాద్ వద్ద 35 లక్షల రూపాయలు తీసుకొని 40 తులాల బంగారాన్ని కొని ఇండియాకు పంపిస్తానని చూడగా, అట్టి విషయం తెలుసుకున్న రవీందర్ వద్ద పనిచేసే కాల్వ వెంకటేష్, తొంటి బీరయ్య మరియు గడ్డం అనిల్, ఇండియాలో ఉండే ఏనుగుల నాగ రాజు ని వారు ఎలాగైనా అట్టి 40 తులాల బంగారాన్ని కాజేయాలని ఉద్దేశంతో మేము ఇండియాకు వెళ్తున్నాం అని, అట్టి నలభై తులాల బంగారాన్ని రుద్రా రామ్ ప్రసాద్ కు అప్పజెప్తామని, రవీందర్ ను నమ్మించగా, రవీందర్ వారి మాటలను నమ్మి తేదీ 26-03-2025 రోజున సౌదీ నుండి బీరయ్య మరియు అనిలతో ఇండియాకు పంపగా, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన తర్వాత నిందితులైన బీరయ్య, అనిల్, మరియు నాగరాజు ముందస్తు పథకం ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో రుద్ర రాంప్రసాద్ పంపించిన వ్యక్తి అయినా సంతోష్ కు బంగారం ఇవ్వకుండా, అతనిని మాటలతో మభ్యపెట్టి, అట్టి 40 తులాల బంగారం ఉన్న బ్యాగును, ముగ్గురు నిందితులైన తొంటి బీరయ్య, గడ్డం అనిల్, ఏనుగుల నాగరాజు అను వారు అట్టి బంగారం ఉన్న బ్యాగును వేరే కారులో వేసుకొని అక్కడి నుండి వెళ్ళి పోయినారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినమని అందులో భాగంగా తొంటి బీరయ్య, గడ్డం అనీలను రిమాండ్కు పంపించామని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరు గురించి కాలుస్తున్నామని వేములవాడ పట్టణ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking