సీతారాం ఏచూరి మరణం ప్రజా, కార్మిక లోకానికి తీరని లోటు
సీఐటీయు ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘన నివాళిలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 13 : సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ భవనం ఎదుట సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాలీలు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…కేంద్ర,రాష్ట్ర చట్టసభల్లో మిగిలిన సభ్యులకంటే కమ్యూనిస్టులే బాధ్యతగా వ్యవహరిస్తారు. ధనవంతులు,భూస్వాముల ప్రాపకం కోసం పాకులాడే వారు కాదు.గనుక శ్రమజీవుల బలహీనుల సమస్యలు నిరంతరం లేవనెత్తుతుంటారు. బయట జరిగే పోరాటాలకు మద్దతుగా సభలో గళం వినిపిస్తుంటారు. కమ్యూనిస్టులంటే ప్రజల కోసం ఉద్యమాలు పోరాటాలు చేసేవారన్నది ఎంత సత్యమో చట్టసభల్లోనూ ఆ ఉద్యమాల లక్ష్యాలను ప్రతిబింబిస్తారనేది అంతే నిజం.పదవీ వ్యామోహాలు లేకుండా ప్రజల కోసం పనిచేయడం కమ్యూనిస్టుల మార్గంగా వుంటుంది.అందుకే ఇప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చే అనేక ప్రయోజనాలు స్థలాలు ఇతర ప్రలోభాలకు వారెన్నడూ లోనవకుండా తోసిపుచ్చుతుంటారు. దేశంలోనే విద్యార్థి, యువత,ప్రజలు,కార్మికులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాగలరు.ఈ కార్యక్రమంలో కాంతమ్మ, సత్తక్క,రజిత,ఎల్లవ్వ, మల్లక్క తదితరులు పాల్గొన్నారు.