తెలంగాణ కాలనీలో మురుగు కాలువ సమస్యను త్వరితంగా పరిష్కరించండి:

రాష్ట్ర అటవీ, పర్యావరణ ,దేవదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 26

తెలంగాణ కాలనీలో మురుగు కాలువ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీను మంత్రి సందర్శించి క్షేత్రస్థాయిలో మురుగు కాలవ సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాలనీ మ్యాప్ ను పరిశీలించి, అధికారులు, కాలనీవాసులతో సమస్య గురించి చర్చించారు.
కాలనీలో మంజూరు చేసిన బిల్డింగ్ పర్మిషన్ లను పునః పరిశీలించి, సమస్యను పరిష్కరించి పక్షం రోజుల్లో మురుగుకాలువ నిర్మాణ శంకుస్థాపన కు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ సిటీ ప్లానర్ వెంకన్న, పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్, విద్యుత్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking