ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ,కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డితో కలిసి ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాలలో పర్యటించిన ఎండీ
ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి: రామంతాపూర్ లోని రామిరెడ్డి నగర్ నుంచి ఉప్పల్ నల్లచెరువు వరకు వచ్చే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రంక్ లైన్ సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్టుగా వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి శుక్రవారం ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుములం పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఉప్పల్ , రామంతాపూర్ ప్రాంతాలలో పర్యటించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిశీలించారు.
ఇటీవల ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డిని కలిసి భూగర్భ డ్రైనేజీ ట్రంకులైన్ సమస్య గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతోనే అశోక్ రెడ్డి ఉప్పల్ రామంతపూర్ ప్రాంతాలలో ప్రత్యక్షంగా పర్యటించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిశీలించారు.
చాలా ఏళ్ళుగా ఉన్న డ్రైనేజీ ట్రంక్ లైన్ సమస్యను ఈ సందర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి ఎండీ అశోక్ రెడ్డికి వివరించారు.

రాంరెడ్డి నగర్- ఉప్పల్ మార్గంలో ఉన్న కాలనీలు లక్ష్మీనారాయణ కాలనీ, చర్చి కాలనీ, ఉప్పల్లోని రాజు నగర్ కాలనీ, సరస్వతి కాలనీలలో ఉన్న డ్రైనేజీ సమస్యను ప్రత్యక్షంగా అశోక్ రెడ్డికి చూపించారు.
ఈ సమస్య పరిష్కారం కోసం త్వరలోనే సూపర్ సక్కర్ అనే యంత్రంతో ట్రంక్ లైన్ ను శుభ్రం చేయించనున్నట్టుగా ఎండి అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో సిజిఎం ఎస్ టీ పి సుజాత ,డైరెక్టర్ స్వామి ,జిఎం అంబర్పేట్ ఎస్ టీ పి సుబ్రహ్మణ్యం ,నల్లచెరువు ఎస్ టీ పి వసంత కుమారీ ,ఉప్పల్ జిఎం సంతోష్ కుమార్ ,ఈఈ నాగేందర్ ,రజనీకాంత్ ,మేనేజర్ రవీందర్ రెడ్డి ,సత్యనారాయణ మరియు లక్ష్మీనారాయణ కాలనీ అధ్యక్షులు లూకాస్ ,అలీం ,రఘపతి రెడ్డి ,బజార్ జగన్నాథ్ గౌడ్ ,తెల్కల మోహన్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ ,దేవి రెడ్డి తదితరులు పాల్గోన్నారు.