ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

 

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి అక్టోబర్19 (ప్రజాబలం) కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు.ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.ఓటర్లను నగదు,మద్యం మరియు ఇతర వస్తువులతో ప్రలోభ పెట్టే వారిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి,చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు,సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని,ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని తెలిపారు.

 

పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలి

ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫ్లాగ్ డే సందర్భంగా జరగనున్న పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.వ్యాసరచన పోటీలు,ఆన్లైన్ ఓపెన్ హౌస్,ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు మరియు ఇతర కార్యక్రమాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల ఫైళ్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు న్యాయాధికారులతో సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.అమాయక ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ డబ్బును నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేకం నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం వర్టికల్స్ వారీగా గత నెలలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతిభను కనబరిచిన అధికారులకు,సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,ఇల్లందు డిఎస్పి రమణమూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేందర్రావు,డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య మరియు సిఐలు,ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking