మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్
చేగుంట 19/09/24 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ జి ఎఫ్ మండల స్థాయి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, మండల నోడల్ ఆఫీసర్ నీరజ, అయిత పరంజ్యోతి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ క్రీడలో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, విద్యార్థుల క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత కలుగుతుందని, క్రీడల వలన అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని వారు అన్నారు. మండల స్థాయి క్రీడలకు బహుమతులు అందజేసిన అయిత పరంజ్యోతి గారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్,పి డీలు శారద, శంకర్, మంజులత,వెంకటేష్, పీఈటీలు శంకర్, నరేష్, వనిత, గిరిజ, ఆదర్శ పాఠశాల , క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ లు చంద్రకళ, సుమతి ఉపాధ్యాయులు రావుల వెంకటేష్,మనోహర్ రావు, విఠల్ రెడ్డి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
