విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ దే భద్యత..

 

ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి

ప్రశాంతమైన మెతుకు సీమగా పేరొందిన మెదక్ జిల్లాది.

ఏదైనా సమస్య తలెత్తితే నేరుగా కలవవచ్చు.

వినాయక ఉత్సవాలు సమిష్టిగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

పోలీసు వారి సలహాలు సూచనలు పాటింఛాలి,

అధిక డేసిబుల్స్ సౌండ్స్ ఇచ్చే డి.జె లకు అనుమతి లేదు

గణేష్ మండపం వద్ద ముగ్గురు వాలంటీర్లు 24×7 తప్పకుండ కాపలా ఉండాలి

ఏ సమస్య వచ్చిన లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు కానీ
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888 సమాచారం అందించండి

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

ప్రజాబలం – మెదక్ జిల్లా నియోజకవర్గం
10.09.2024:

మెదక్ పట్టణలోని ద్వారకా గార్డెన్ లో మెదక్ పట్టణ సిఐ శ్రీ. నాగరాజు గారు మరియు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ గారి ఆద్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సమావేషానికి జిల్లాఎస్. పి. . డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ముఖ్య అతిదిగా హాజరైనారు. ఈ సందర్భంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సబ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ, ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచించారు. ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి ప్రశాంతమైన మెతుకు సీమగా పిలువబడుతున్న మెదక్ జిల్లాలో ఉన్నదని అది ఏంతో సంతోషకరమైన విషయం అని, ఈ అనవాయితీ నీ అలాగే కొనసాగించాలని అన్నారు.
జిల్లా ప్రజలు వినాయక ఉత్సవాలు సమిష్టిగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. వినాయక ప్రతిష్ట నుండి నిమజ్జనం పూర్తయ్యేంత వరకూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, వినాయక మండపాల ఆర్గనైజర్లు వినాయక మహోత్సవం సందర్భంగా ఏదైనా సమస్య వస్తే సంబందిత పోలీసు స్టేషన్ కి కానీ డయల్ 100 కి కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888 సమాచారం అందిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అన్ని మతాల వారు కలసి పండుగ జరుపుకోవడం మెదక్ జిల్లాలో గొప్ప ఆచారమని తెలిపారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. మండపాల వద్ద తగినంత సంఖ్యలో స్థానిక సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించి భక్తులను క్రమబద్ధీకరించే విధంగా చూడవలెను. మండపాలకు నాణ్యత కలిగిన వైరుతో కరెంట్ కనెక్షన్ ఇవ్వవలెను. వివాదాస్పద ప్రదేశాలలో మండపాలు ఉండకూడదు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించరాదు. గణేష్ మండపం వద్ద ముగ్గురు వాలంటీర్లు 24×7 తప్పకుండ కాపలా ఉండాలని సూచించారు. మండపాల వద్ద టపాకాయలను ఇతర మందుగుండు సామాగ్రిని ఉంచరాదు.
వినాయక విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రసు, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి. విగ్రహాల దగ్గర బాక్స్ టైప్ స్పీకర్ల కొరకు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే అధిక డేసిబుల్స్ సౌండ్స్ ఇచ్చే డి.జె లకు అనుమతి లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 0600 గం: ల నుండి రాత్రి 10:00 వరకు స్పీకర్లను మాత్రమే వాడాలి, స్పీకర్ సౌండ్ మోతాదులోనే ఉండాలి, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి, లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ప్రార్థన మందిరాలకు, ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు. మండపాల వద్ద వాటర్ డ్రమ్ము మరియు ఇసుక తప్పకుండా ఉంచవలెను. మద్యం సేవించి మండపాల వైపు రాకూడదు, రెచ్చగొట్టే పొస్టర్లు గాని, బ్యానర్లు గాని, కరపత్రాలను గాని పంచకూడదు, అంటించకూడదు. మండపాల వద్ద కొత్త వ్యక్తులు సంచరించినచో మరియు ఎలాంటి సమాచారమైన పోలీసు వారికి విధిగా తెలియపరచాలి. సోషల్ మీడియాలో వచ్చే అనవసర వదంతులను, పుకార్లు నమ్మరాదు. విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ పూర్తి భద్యత వహించవలెను. పెద్దలు నిర్ణయించిన తేదీ లోపల నిమజ్జనం పూర్తి చేయాలని కోరారు. పోలీసు వారు పైన సూచించిన నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే వినాయక విగ్రహాల కమిటీ మెంబర్లు, నిర్వాహకులు సంబందిత వ్యక్తులు పోలీసు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాద్యులు అవుతారన్న విషయాన్ని గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిద వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సబ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking