పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 19: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కలెక్టర్ లతో హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
వికాస్ రాజ్ మాట్లాడుతూ బిఎల్వో లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఫార్మ్ లను పూర్తి చేయాలన్నారు. 18-19 ఏళ్ల ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ప్రతి వారం పొలిటికల్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని డూప్లికేట్ ఓటర్లను తొలగించాలన్నారు. ప్రతి రోజు ఓటర్ల జాబితాపై రిపోర్ట్ పొందుపరచాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.