పేద వాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకంను తీసుకొచ్చింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథక ఖమ్మం కార్పొరేషన్ లోని 2, 3, 4, 8, 26వ డివిజన్లు, రఘునాధపాలెం మండలం బూడిదం పాడు ఈర్లపుడి గ్రామాల లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంజూరు పత్రాలు అందజేసి గృహాలక్ష్మి పథక మంజూరు పంపిణి కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ఖమ్మం నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు అదనంగా గృహాలక్ష్మి పథకం ద్వారా సొంత స్థలం ఉన్న వారికి తమ సొంత ఇంటి కల ను నెరవేర్చామని అన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ నగర్ లో 230 ఇల్లు, టేకులపల్లిలో 2వేల ఇల్లు ఒకే సముదాయంలో నిర్మించి గేటేడ్ కమ్యూనిటీ తరహాలో అద్భుతంగా ఇల్లు నిర్మించి ఇచ్చామని అన్నారు. రామన్నపేట, వైఎస్సార్ నగర్, అల్లిపురం లలో నిర్మాణం జరుగుతున్నాయని వాటికి కూడా అర్హులైన పేదలకు పూర్తి పారదర్శకంగా అందిస్తామన్నరు. గడచిన అతితక్కువ సమయంలో నగరంలో 5వేల మందికి ఇల్లు నిర్మించామని, 4వేల మందికి జీవో నెం.58 ద్వారా పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చామని అన్నారు. గృహలక్ష్మీ పథకం పేదల కుటుం బాలను మెరుగుపరచడానికి, వారికి భద్రత, స్థిరత్వ భావనను అందించడానికి సహాయ పడుతుందని, ఈ పథకం ద్వారా నిర్మాణ రంగంలో ఉద్యోగాలను సృష్టించడం ద్వారా పేదలకు పనులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు వెచ్చించి మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కు 3వేల ఇళ్లను నిర్మించను న్నామని ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 4వేల ఇళ్లకు దరఖాస్తులు రాగా ఇప్పుడు రెండు వేల ఇళ్లకు మంజూరు పత్రాలు అందిస్తు న్నామని, రెండవ విడతలో మళ్ళీ మిగిలిన రెండు వేల ఇళ్లను కూడా అందిస్తామని ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదన్నారు. గృహలక్ష్మి పథకం మంజూరైన లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయా పత్రాలను మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణి చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి స్వంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుందని అన్నారు. గతంలో ఇండ్ల స్థలాలు అసైన్డ్ చేసినట్లు, 3 వేల మందికి జీవో 58 క్రింద పట్టాలు అందజేసినట్లు ఆయన అన్నారు. జిల్లాకు 15500 గృహాలక్ష్మి ఇండ్లు మంజూరు అయినట్లు, ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఉన్నట్లు, దీనిక్రింద ప్రతి లబ్దిదారునికి ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మంజూరు పత్రాలు పొందిన వారు వెంటనే మంచిరోజు చూసుకొని పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. బేస్ మెంట్ వరకు లక్ష, రూఫ్ లెవల్ వరకు వస్తే మరో లక్ష, పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు గృహాలక్ష్మి క్రింద అందజేస్తారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అర్డిఓ జి. గణేష్, తహశీల్దార్ స్వామి, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జడ్పిటిసి ప్రియాంక, ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, సహాయ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు